Sunday, November 6, 2011

Lyricists - Music Directors - Playback Singers


(Written in Telugu)

కొన్ని నెలల క్రితం ఒక రోజు టీవీలో చంద్రబోసు తను రాసిన పాట పల్లవి పాడటం విన్నాను. నాకు బాగా నచ్చింది. ఒకరితో పోల్చడం కాదు కాని, నాకు ఆ పాట ఒరిజినల్ సింగర్ కంటే చంద్రబోసు పాడితే బాగుందని అనిపించింది. చంద్రబోసు మంచి సింగర్ కూడా అనుకున్నాను.

కొంత కాలం తరువాత `సిరివెన్నల' సీతారామ శాస్త్రీ తను రాసిన పాట పల్లవి చెప్పడం విన్నాను (పాత రికార్డింగ్). అరె, చాలా బాగుంది అనిపించింది. శాస్త్రీ గారు చంద్రబోసులా మంచి సింగర్ కాదు, అయినప్పటికీ పాట విన్నప్పటి కంటే శాస్త్రి గారు చెప్పినప్పుడే బాగుందని ఎందుకు అనిపించింది?

మరి కొంత కాలం తరువాత అనంత శ్రీరామ్ తన పాట పాడడం విన్నాను. మైమరచి పోయాను. ఎంత మధురంగా ఉంది, ఇంకా వినాలి అనిపించింది. నేపధ్య గాయకుడు పాడిన దాని కంటే చాలా బాగుంది అనిపించింది. ఈ సారి మర్మం  గ్రహించాను.

సహజంగా నేపధ్య గాయకుడు పాడటాన్ని ప్రేమిస్తాడు. గేయరచయిత పాటలో ప్రతీ పదాన్ని ప్రేమిస్తాడు; తానూ రాసిన ఆ పాటని తన్మయత్వంతో చెబుతాడు. అందుకే అంత మాధుర్యం. ఇది తెలిసింది.

అలాంటప్పుడు ప్రతీ పాటని గేయ రచయిత తోనే పాడించవచ్చుగా? పాట ప్రాచుర్యంలో ఉండాలన్న, పదికాలాలు ఉండాలన్న సాహిత్యంతో పాటు సంగీతం, గాత్రశుద్ధి  కూడా కావాలి. అందుకే  గేయరచయితలతో పాటు సంగీత దర్శకులు, నేపధ్య గాయకులు కూడా కావాలి. ఓహ్ `I re-invented the wheel' అని నవ్వుకున్నాను.   



   

No comments:

Post a Comment